టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా టీమ్ తొలిసారి ఫైనల్ చేరింది. సెమీఫైనల్-1 మ్యాచులో అఫ్ఘానిస్థాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. టోర్నీలో పరాజయం అనేది లేకుండా దక్షిణాఫ్రికా తుది పోరుకు అర్హత సాధించడం విశేషం.మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘానిస్థాన్‌ను 56 పరుగులకు కుప్ప కూల్చింది. అనంతరం 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా ఫైనల్ కలని నెరవేర్చుకుంది. నిజానికి దక్షిణాఫ్రికా టీమ్‌ను సెమీ ఫైనల్ ఫోబియా దశాబ్దాలుగా వెంటాడుతోంది. ఆ జట్టు ప్రతిసారి సెమీస్‌లోనే ఓడి ఇంటిబాట పట్టడం ఆనవాయితీ. కానీ ఫస్ట్ టైమ్ ఆ ఫోబియాని దాటి ఫైనల్ గడప తొక్కింది.ఈరోజు రాత్రి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచులో గెలిచి జట్టు ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలడనుంది.