వైయస్‌ఆర్‌సీపీలోని కీలక నేతల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొంత మంది అరెస్ట్ అవ్వగా.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఎలాంటి అరెస్ట్‌లు జరగలేదు. కానీ.. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని కూడా అరెస్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి సీదిరి అప్పలరాజుకి ఇటీవల కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనలో చేసిన వైద్య సాయంతో మంచి పేరొచ్చింది. ఆలయంలో తొక్కిసలాట ఘటనను తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకుని వైద్యుడిగా అత్యవసర సేవలు అందించి ప్రశంసలు అందుకున్నారు. అయితే.. గతంలో సోషల్ మీడియాలో నిరాధారమైన పోస్టులు పెట్టాడని సీదరిని కాశీబుగ్గ పోలీసులు తాజాగా పిలిపించి ఏడు గంటల పాటు విచారించారు.