Current Date: 02 Apr, 2025

Shahrukh Khan offers blank check to Gautam Gambhir

కోల్‌కతా జట్టు ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన నేపథ్యంలో గంభీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.ఐపీఎల్ 2023 సీజన్‌‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి కోచ్ గా వ్యవహరిస్తున్న సమయంలో కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా రావాలంటూ గౌతమ్ గంభీర్‌ను షారుఖ్ ఖాన్ కోరారని, ఇందుకుగానూ ఏకంగా ‘బ్లాంక్ చెక్’ను ఆఫర్ చేశారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పదేళ్లపాటు కోల్‌కతా జట్టుకి పనిచేయాలంటూ షారుఖ్ అడిగారని తెలిపింది. గంభీర్‌ను ఎక్కువ కాలం పాటు జట్టుతో ఉంచాలనే ఉద్దేశంతో షారుఖ్ ఈ భారీ ఆఫర్ చేసినట్టు పేర్కొంది.