బంగ్లాదేశ్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్‌లో ఫెయిలయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాటౌట్ అయినా.. కోహ్లీ పెవిలియన్‌కి వెళ్లిపోవడం కెప్టెన్ రోహిత్ శర్మకి కోపం తెప్పించింది.బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ వేసిన 20వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ షాట్ ఆడలేకపోయాడు . బంతి బ్యాటుకు సరిగా కనెక్ట్ కాకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ను తాకింది. దీంతో బౌలర్‌తో పాటు మిగతా బంగ్లాదేశ్ ప్లేయర్లు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. వెంటనే అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. అయితే బంతి ప్యాడ్‌ను తాకకముందే విరాట్ కోహ్లీ బ్యాట్‌ను తాకింది. కానీ, కోహ్లీ డీఆర్‌ఎస్ తీసుకోలేదు.రివ్యూ తీసుకోవాలని నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ సూచించినా.. పెడచెవిన పెట్టాడు. అయితే రీప్లేలో కోహ్లీ నాటౌట్ అని నిర్ధారణ అయింది. బంతి ప్యాడ్‌ను తాకకముందే బ్యాట్‌ను తాకినట్లు రిప్లేలో కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. అది చూసి షాక్ అయ్యాడు. కోహ్లీ రివ్యూ తీసుకోవాల్సింది కదా? అంటూ కోప్పడ్డాడు.