Current Date: 02 Apr, 2025

Samantha's post on Kurnool student.. Inspirational book!

కర్నూలు విద్యార్థినిపై హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం తనే నాకు ఆదర్శం అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల రిలీజైన ఆంధ్రప్రదేశ్‌  ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో ఆలూరు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో చదివిన ఎస్ నిర్మల బైపీసీలో 440 కి 421 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది.

బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. పదో తరగతిలోనూ 537 మార్కులు సాధించింది. నిరుపేదలైన నిర్మల తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు.

కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది.  ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. నిర్మలపై సోషల్ మీడియాలో చాలా మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.