జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో.. సమయం దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ పెట్టుకుని న్యత్యాలు చేయటంపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. వాస్తవానికి హైదరాబాద్‌లో డీజేలను నిషేధించారు. అయితే.. బతుకమ్మ వేడుకల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డీజేలు పెట్టటమే కాకుండా.. తల్వార్ పట్టుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. " కొందరు ఓర్వలేక పోలీసులను ఉసిగొల్పినా.. అక్క ఉన్నంతవరకు ఎవ్వరూ కూడా భయపడనక్కర్లేదు. పోలీసులు వచ్చినా ఏం చెయ్యలేరు.. నేనున్నా ఇవాళ ఈ తల్వార్ నేను పట్టుకున్నా.. రేపు మీరు పట్టుకోవాలి." అంటూ గద్వాల విజయలక్ష్మి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సామాన్య ప్రజలకు ఒక రూల్.. మేయర్‌కు ఒక రూలా అంటూ నగరవాసుల నుంచి నెట్టింట పెద్ద ఎత్తున ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీంతో.. ఈ వ్యవహారంపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు.. సుమోటోగా కేసు నమోదు చేశారు.