Current Date: 06 Oct, 2024

స్పందన కార్యక్రమం పేరును పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌గా మారుస్తూ ఉత్తర్వులు

స్పందన కార్యక్రమం పేరును పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌గా పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సీఎస్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనల స్వీకరణకు స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అనేక లోపాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టమ్ పేరునే పునరుద్ధరిస్తూ టీడీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Share