Current Date: 06 Oct, 2024

చంద్రబాబు కోసం టీచర్స్ రిక్వెస్ట్.. ఒక్క రోజు లేట్‌గా స్కూల్స్!

ఏపీలో పాఠశాలల పునర్ ప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి చేయడంతో.. ఒక్క రోజు ఆలస్యంగా అంటే జూన్ 13న పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి.చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 12న ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వీఐపీలు రానుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

Share