Current Date: 25 Nov, 2024

హీరోయిన్ నయనతారకి హ్యాకర్స్ ట్విస్ట్ హడావుడిగా రికవరీ

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార సాధారణంగా సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండేది కాదు. కానీ ఒక్కసారిగా ఆమె అకౌంట్ నుంచి తన పిల్లలు, భర్తకి సంబంధించిన విషయాలు, ఫ్యామిలీ ఔటింగ్స్ ఫోటోలు షేర్ అవుతూ వచ్చాయి. దాంతో అరుదుగా పోస్ట్‌‌లు పెట్టే నయనతారకి ఇలా పోస్టులు పెడుతుందేంటి? అని అంతా అనుకున్నారు. దాంతో తన ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్ అయ్యిందంటూ నయనతార ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది.హ్యాకర్స్ ఇటీవల సెలబ్రిటీల అకౌంట్స్‌పై దాడి చేస్తున్నారు.ఆ స్టార్‌ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా కొందరు పోస్ట్‌ లు పెడుతున్నారు. ఇప్పుడు నయనతార ట్విట్టర్ అకౌంట్‌‌ను హ్యాక్ చేసిన వారు తప్పుడు పోస్ట్‌ లు పెడుతూ ఉండగా, వాటిని వెంటనే నయనతార టీం తొలగిస్తూ.. అకౌంట్‌ను రికవరీ చేస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే. గత సంవత్సరం బాలీవుడ్‌ లో షారుఖ్ ఖాన్‌ తో కలిసి 'జవాన్‌' సినిమాలో నయనతార నటించింది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది.కానీ. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తన సినిమాలేమీ రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. 

Share