ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నేడు కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఆయన చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులతో పాటు కండరాల నొప్పులతో మోహన్ లాల్ బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు ఈ సందర్భంగా వెల్లడించాయి. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని స్పష్టం చేశాయి. వైరల్ ఫీవర్తో ఆయన ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాయి. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు సూచించారు.