ఈ నెల 28, వచ్చే నెల 1 తేదీల్లో ఏసీఏ విడిసిఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టి సి సి ఎల్ క్రికెట్ లీగ్ రెండు రోజులు పాటు జరగనుందని, ఈ సందర్భంగా విశాఖ రావడం ఆనందంగా ఉందని సినీ నటులు శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక డాల్ఫిన్ హోటల్ లో నిర్వాహకులు, తెలుగు నటులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ టీ సీ ఎల్ మ్యాచ్ ల కోసం షూటింగ్ లు ఉన్నప్పటికీ తెలుగు నటులు పాల్గొంటున్నారన్నారు. పీఎం పాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ ను సెలబ్రిటీల మ్యాచ్ కోసం ప్రభుత్వం కేటాయించేలా కృషి చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కేసినేని చిన్నిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ప్రజలందరూ పాల్గొని క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. అనేక చోట్ల టి సి సి ఎల్ మ్యాచ్ లు ఆడామని, విశాఖలో టి సి సి ఎల్ కు సపోర్ట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ టి సి సి ఎల్ లో మూవీ, టివి ఆర్టిస్టులు, పొలిటిషియన్స్, కార్పొరేట్స్ ప్రతినిధులు, పోలీస్ టీమ్స్ పాల్గొంటున్నాయన్నారు.
హీరో తరుణ్ కామెంట్స్ మాట్లాడుతూ విశాఖ క్రికెట్ లీగ్ ఆడడం ఆనందంగా ఉందని, ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఆడడానికి విశాఖ రావడం సంతోషంగా ఉందన్నారు. నటులు ఓంకార్ మాట్లాడుతూ టి సి సి ఎల్ ప్రారంభం అవుతుందని, ఈ క్రికెట్ లీగ్ లో 7 టీములు తల పడనున్నాయని తెలిపారు. మంచి కాజ్ కోసం క్రికెట్ లీగ్ అడుతున్నామని, అందరూ సపోర్ట్ చేయాలని ఆయన కోరారు. సమావేశం లో విశాఖ నగరం దేశంలోనే స్వచ్చ సర్వేక్షన్ లో పరిశుభ్ర నగర పోటీలలో ప్రధమ స్థానం పొందేందుకు “ఐ సపోర్ట్ వైజాగ్” అంటూ వేదికపై ఉన్న నటులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ మద్దతు తెలిపారు.
కార్యక్రమంలో ఇంకా హీరో సుధీర్ బాబు, ఈటీవీ ప్రభాకర్, అశ్విన్, లీగ్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
Share