Current Date: 06 Oct, 2024

నర్సీపట్నం ప్రాంతం లో భారీ వర్షం ఉరుములతో పిడుగులు.. కాలిపోయిన చెట్లు

శుక్రవారం సాయంత్రం నర్సీపట్నం  ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. పిడుగులు పడ్డాయి.గొలుగొండ గురుకుల పాఠశాల సమీపంలో ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న తాటిచెట్లపై పిడుగులు పడి చెట్లు కాలిపోయాయి. ఈదురు గాలులు వీ. గొలుగొండ  ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. నర్సీపట్నం యూనియన్ బ్యాంక్ సమీపంలో పార్క్ చేసి ఉన్న కారు పై చెట్టు  పడి కారు కి నష్టం వాటిల్లింది  . నర్సీపట్నం టౌన్ లో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. గంటపాటు ఏకధాటి గా వర్షం కురిసింది. భారీ శబ్దాలు చేస్తూ  పిడుగులు పడటంతోప్రజలు భయభ్రాంతులయ్యారు

Share