Current Date: 02 Apr, 2025

Rammohan took charge as Union Minister...

టీడీపీ యంగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో మధ్యాహ్నం 01:10 గంటల సమయంలో కేంద్ర పౌర విమానా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దేశంలో అత్యంత పిన్న వయసులో కేంద్ర కేబినెట్ మంత్రి పదవి రామ్మోహన్ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీకాకుళం ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. సీఎం చంద్రబాబు తనకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారన్నారు. తనపై నమ్మకంతో ప్రధాని నరేంద్ర మోదీ.. పౌర విమానయాన శాఖ అప్పగించారన్నారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్ని శాఖలను మోదీ కోరారని మంత్రి చెప్పుకొచ్చారు.

Share