Current Date: 02 Apr, 2025

ఎన్నికల బహిష్కరణకు గంగవరం మత్స్యకారుల పిలుపు

గంగవరం పోర్టు కార్మికులు తమ సమస్య పరిష్కారం కాకపోవంతో ఎన్నికల బహిష్కరణకు పిలుపు నిచ్చారు. దీనికి గంగవరం పోర్టు యాజమాన్యం, జిల్లా కలెక్టర్‌ బాధ్యత వహించాలని ప్రకటించారు. చట్ట ప్రకారం తమకు ఇవ్వాల్సిన వేతనమైనా ఇవ్వాలి లేదా స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా ఒక్కొక్కరికి 35 లక్షల రూపాయల చొప్పున అయినా ఇవ్వాలి అని యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకూ రెండు సార్లు పోలీసు కమిషనర్‌ చర్యలు జరిపారు. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు చెందిన కోకింగ్‌ కోల్‌తో వున్న రెండు నౌకల్ని విడుదల చేయాలని పోలీసు కమిషనర్‌ కోరారు. అయితే గంగవరం పోర్టు యాజమాన్యంతో తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ తాము రవాణాను అనుమతించబోమని తేల్చి చెప్పారు. అయినా తాము సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటామని యూనియన్‌ నాయకులు వెల్లడిరచారు.