పద్మా అవార్డుల పురస్కారాలకు సంబంధించి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నట్టు విశాఖ జిల్లా యంత్రాంగం ఓ ప్రకటనలో తెలియజేసింది. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చే వారికి ఈ అవార్డులివ్వనున్నారు. ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ ఎఫైర్స్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సివిల్ సర్వీస్, స్పోర్ట్స్ రంగాల్లో అత్యున్నత కృషి, సేవలందించేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, నిర్ణీత నమూనా, వెబ్‌సైట్‌లో తెలిపిన విధంగా ధృవీకరణ పత్రాలతో వివరాలు పేర్కొనాలని అధికారులు తెలిపారు. జాతీయ, రాష్ట్రీయ అవార్డులు పొందిన వారూ అర్హులేనని, http://awards.gov.in ద్వారా అభ్యర్థుల ప్రతిపాదనల్ని ఓ కాపీ జెరాక్స్, సాఫ్ట్ కాపీ విశాఖలోని మహారాణిపేటలో ఉన్న జిల్లా యువజన సంక్షేమ అధికారి కార్యాలయానికి పంపించాలన్నారు. సెట్విస్ సీఈవో కార్యాలయానికి వచ్చే నెల 18వ తేదీలోగా పంపించకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పని వేళల్లో సంప్రదించొచ్చని కలెక్టర్ కార్యాలయ వర్గాలు కూడా స్పష్టం చేశాయి.