Current Date: 07 Oct, 2024

వ‌ర‌ల‌క్ష్మి రిసెప్ష‌న్ బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్‌, ఖుష్బూ హంగామా

క్రాక్ జ‌య‌మ్మ... వ‌ర‌ల‌క్ష్మి పెళ్లి నికోలాయ్ స‌చ్‌దేవ్‌తో రెండు రోజుల క్రితం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. తాజాగా గత రాత్రి చెన్నైలో వివాహా రిసెప్ష‌న్ వేడుక నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు కొలీవుడ్ నుంచే కాక‌, బాలీవుడ్‌, టాలీవుడ్ నుంచి చాలామంది సెల‌బ్రిటీస్ హ‌జ‌రై నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు.  అయితే ఈ వేడుక‌లో అంద‌రి క‌న్నా మ‌న నంద‌మూరి బాల‌కృష్ణ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. నాటి తార‌ల‌తో హుషారుగా మాట్లాడుతూ, సెల్ఫీలు దిగుతూ బాగా సంద‌డి చేశారు. బాల‌కృష్ణ‌తో పాటుగా విక్ట‌రీ వెంక‌టేశ్, ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్, సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ కూడా ఈ వేడుక‌లోపాల్గొన్నారు.

Share