వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేనివారికి శ్రీవారి దర్శనానికి 18 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ ఉంది. శనివారం 90,011 మంది శ్రీవారిని దర్శించుకోగా 39,083 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది.