Current Date: 26 Nov, 2024

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

తన బెయిల్‌పై డిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్‌, సీఎం కేజ్రీవాల్‌కు ఊరట మాత్రం దక్కలేదు. కేజ్రీవాల్ పిటిషన్‌ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌‌తో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం వెల్లడించింది. అయితే అప్పటి వరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తామని అలాగే జూన్ 26వ తేదీన ఈ పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. దాంతో సుప్రీంకోర్టులో సైతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కనట్లు అయింది.

Share