Current Date: 06 Oct, 2024

ఏపీ కొత్త సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఎవరంటే..?

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మంత్రులుగా పలువురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా నేడు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు.ఏపీలో కూటమి ఏర్పడటంతో సినీ పరిశ్రమలో అందరూ ఆనందం వ్యక్తం చేసారు. సినీ పరిశ్రమకు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఉండటంతో సినీ పరిశ్రమ ఏపీ ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు దక్కుతాయని భావిస్తుంది. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఎవరికిస్తారని ఆలోచించగా జనసేనకే కేటాయించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ కు పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖలు కేటాయించగా జనసేన తరపున నిడదవోలు నుంచి పోటీ చేసి గెలిచిన కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. నిడదవోలు ఎమ్మెల్యే, జనసేన నేత కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ శాఖతో పాటు టూరిజం & కల్చర్ శాఖలు కూడా కేటాయించారు.

Share