Current Date: 26 Nov, 2024

మత్స్యకారుల్ని చూసి చలించిపోయిన హెూంమంత్రి అనిత

మత్స్యకారుల సమస్యలు విని హోమ్ మంత్రి   వంగలపూడి అనిత చలించిపోయారు. అక్కడికక్కడే జిల్లా ఎస్పీకి ఫోనే చేసి వారికి భరోసా కల్పించారు. వైసీపీ హయాంలో తమపై పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తేయాలని కోరుతూ బాపట్ల జిల్లా మత్స్యకారులు శుక్రవారం అనితకు వినతినందజేశారు. చీరాల వైపు వెళ్తున్న హెం మంత్రి.. బాపట్లకు చెందిన మత్స్యకారుల చేతిలో వినతి పత్రాలు చూసి కాన్వాయ్ ను మధ్యలోనే ఆపేశారు. వైసీపీ పాలనలో తమను కొట్టి జైళ్లు. కోర్టుల వెంబడి తిప్పారంటూ అనిత వద్ద మత్స్యకారులు కన్నీటి పర్యంతమయ్యారు. వేటపాలెం మండలం రామాపురంలో 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవను గ్రామ సమస్యగా మార్చి గ్రామస్థులపై అక్రమ కేసులు పెట్టారని అనితకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికి కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. ఎటువంటి తప్పు చేయకపోయిన అక్రమంగా కేసులు పెట్టి ఆర్థికంగా, మానసికంగా హింసిం చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదుపై బాపట్ల జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన హెూంమంత్రి మత్స్యకారుల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే అక్రమ కేసులపై వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో మత్స్యకారులంతా అనిత చర్యలకు సంతోషపడ్డారు.

Share