Current Date: 18 May, 2026

అల్లకల్లోలంగా విశాఖ సముద్ర తీరం..

అల్లకల్లోలంగా విశాఖ తీరం
ఆర్కేబీచ్‌లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారు 30 మీటర్ల ముందుకు కెరటాలు దూసుకొస్తున్నాయని లైఫ్ గార్డ్స్ తెలిపారు. పర్యాటకులు సముద్ర స్నానాలకు దిగకుండా విజిల్స్ వేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఆదివారం కావడంతో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కావున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.