టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన కుమారుడికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. కొడుకు అగస్త్య ఆడుకుంటుండగా హార్దిక్ అతడి ఒడిలో నిద్రించాడు. ఈ క్యూటెస్ట్ ఫొటోను పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి' అనే క్యాప్షన్‌తో పిక్‌ను షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ క్యూటెస్ట్ ఫొటో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం హార్దిక్ వచ్చే నెల 8 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు కొంచెం విరామం దొరకడంతో ఆ విలువైన సమయాన్ని తన కుమారుడితో గడుపుతున్నాడు. ఇక నటాషా, హార్దిక్ విడాకుల అనంతరం అగస్త్య తన పెద్దమ్మ పాంఖురి వద్దే ఉంటున్నాడు. ఈ చిన్నారి ఆలనాపాలనా తనే చూస్తోంది.