Current Date: 27 Nov, 2024

ఇండియన్ ఎయిర్ పోర్టులు, సరిహద్దుల్లో ఎంపాక్స్ అలర్ట్...

విదేశాలలో మంకీపాక్స్ కేసులు వేగంగా పెరుగుతుండడం, పొరుగున ఉన్న పాకిస్థాన్ లోనూ పలువురికి వైరస్ సోకడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టులు, దేశ సరిహద్దుల వద్ద అలర్ట్ ప్రకటించింది. వైరస్ మన దేశంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చే వారిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారెంటైన్ చేయాలని పేర్కొంది. ఈమేరకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్ జంగ్ హాస్పిటల్, లేడీ హార్దింగ్ హాస్పిటల్ లో మంకీపాక్స్ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. బాధితులను క్వారెంటైన్ చేయడానికి, చికిత్స సదుపాయాలకు ఏర్పాటు చేసింది. అదేవిధంగా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 32 ల్యాబ్ లలో అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.

Share