ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘటన విజయం సాధించింది. ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. మరోవైపు వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ ఆ పార్టీ తాజాగా జరిగిన ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయింది. దీంతో సీఎం జగన్ మంగళవారం సాయంత్రమే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు. ఈ క్రమంలోనే ఏపీ 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ బుధవారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే జూన్ 9న ఉదయం 11 గంటలకు అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది మంత్రలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.