భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి. వి. సింధు జన్మదినం :
Jul 05, 2024
పూసర్ల వెంకట సింధు ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. సింధు 1995 జూలై 5న హైదరాబాదులో జన్మించింది.సింధు 8 ఏళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది 2001 ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ ను గెలుచుకున్న పుల్లెల గోపీచంద్ ప్రేరణ తో బాడ్మింటన్ ను తన ప్రధాన ఆటగా ఎంచుకుంది. చైనా లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి ఆ పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 2016 లో జరిగిన రియో ఒలింపిక్స్ క్రీడలలో రజిత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది