Current Date: 26 Nov, 2024

పవన్ కళ్యాణ్‌పై యాంకర్‌ శ్యామలని ఉసిగొల్పుతున్న వైసీపీ డైరెక్ట్ అటాక్

ఏపీలో శాంతి భద్రతలు, మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి కూటమి సర్కారు వైఫల్యంపై వైసీపీ విమర్శలు కొనసాగిస్తోంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆరోపించారు.సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో బాధితురాలు అందుకే పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చిందంటూ యాంకర్ శ్యామల ఆరోపించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కూడా యాంకర్ శ్యామల విమర్శలు గుప్పించారు. వారి నియోజకవర్గాల్లో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరిగితే కనీసం పరామర్శించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.30 వేల మంది అమ్మాయిలు మాయమైపోయారంటూ అబద్ధపు ప్రచారాలు చేసి.. జగన్ గారి మీద నిరంతరం ఆరోపణలు చేసిన మీ నోటి వెంట.. ఒక్క మాట కూడా ఎందుకు ఇవాళ రావడం లేదు? హిందూపురంలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం జరిగితే అక్కడి ఎమ్మెల్యేకు బాధ్యత లేదా.. ఒక్కసారైనా వెళ్లి పరామర్శించారా..? అంటూ యాంకర్ శ్యామల ప్రశ్నించారు. 

Share