Current Date: 05 Oct, 2024

నాగచైతన్య మళ్లీ పెళ్లి అమ్మాయి ఎవరంటే?

హీరో అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. టాలీవుడ్‌లో నాలుగేళ్లపాటు మోస్ట్ క్యూట్ కపుల్‌గా కితాబులు అందుకున్న అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని ఎవరి లైఫ్‌ను వాళ్లు లీడ్ చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా నాగ చైతన్య తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇవి నిజమే అంటూ కొన్ని వెకేషన్ పిక్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. నాగ చైతన్య-శోభిత నిశ్చితార్థం ఆగస్టు 8న అంటూ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోను నాగార్జున త్వరలోనే సోషల్ మీడియాలో పంచుకుంటారంటూ కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ ప్రకటన చేస్తుందంటున్నారు. సమంతను ప్రేమించిన నాగ చైతన్య 2017లో ఆమెను పెళ్లాడారు. కానీ కొన్నాళ్లకే వీరి బంధం ముగిసిపోయింది. పెళ్లి అయిన నాలుగేళ్లకే 2021లో ఈ జంటకి విడాకులు అయ్యాయి. ఈ వార్త అటు అక్కినేని ఇటు సమంత అభిమానులను షాక్‌కి గురిచేసింది. కానీ ఇప్పటికీ వీరి విడాకులకి కారణం ఏంటనేది తెలియలేదు.

Share