Current Date: 27 Nov, 2024

గుండెపోటుతో డ్రైవర్‌ మృతి.. పొలాల్లోకి ఆర్టీసీ బస్సు

 డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. బాపట్ల జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు రేపల్లె నుంచి చీరాల వెళ్తుండగా కర్లపాలెం వద్ద డ్రైవర్‌ సాంబశివరావుకు గుండెపోటు వచ్చింది. బస్సు వేగాన్ని తగ్గించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్‌ మాత్రం మృతిచెందారు. బస్సు అదుపుతప్పే సమయంలో సైకిల్‌ను ఢీకొట్టడంతో ఒకరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 

Share