తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ శాఖలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని చట్టవిరుద్ధమని కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పటిషిన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయాల సవ్యత, ఔచిత్యాన్ని పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ విచారణలో భాగంగా కేసీఆర్‌కు నోటీసులు పంపింది.