Current Date: 26 Nov, 2024

భారత్ పాక్ యుద్ధం కళ్ళకు కట్టినట్టు చూసే ఛాన్స్.. ఎక్కడో తెలుసా?

అది 1971 వ సంవత్సరం భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం.. యుద్ధ వీరుల సాహసాలు  అంటే చరిత్ర.. విశాఖ నగర ఘనత  అన్ని మీ కళ్ళ ముందుకు అది కూడా సుందర సాగర తీరంలో.. ఆ ప్రదర్శన కూడా ఎక్కడో కాదు. భారత్ పాక్ యుద్ధం విజయానికి ప్రతికగా బీచ్ రోడ్లో నిర్మించిన విక్టరీ ఎట్ సీ స్తూపం పైన లేజర్ షో నిర్వహించనున్నారు. జీవీఎంసీ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అక్టోబర్ 27 ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి బీచ్ రోడ్డులో వైఎంసీఎ సమీపాన గల ” విక్టరీ ఎట్ సీ ” స్థూపంపై సౌండ్ అండ్ లేజర్ షో వేస్తున్నారు. ఈ లేజర్ షోలో 1971 నౌకాదళం యుద్ధం, విశాఖ నగరం పాత్ర, యుద్ధ వీరుల సాహసాలతో పాటు దేశ చరిత్రను తెలిపే విధంగా అద్భుతమైన లేజర్ షో నిర్వహిస్తారు. 

Share