Current Date: 06 Oct, 2024

శాలువాలు వద్దు పుస్తకాలు ముద్దు

అభినందనలు అనే సరికి శాలువాలు, పూల బొకేలు, పూల దండలు, కేకులు ఇవే కనబడతాయి.  క్యూ లో నిల్చొని మరి వీటిని తమ అభిమాన నాయకునికి అందించి తన్మయత్వం పొందడం తరచూ చూస్తూనే ఉంటాము. కానీ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రీవాణి శ్రీ ఈ సాంప్రదాయాలకు భిన్నంగా ఊర్లో ఒక గమనిక బోర్డు ను పెట్టి అందర్నీ ఆలోచించేటట్టు చేశారు. తనను కలవడానికి వచ్చే వారు పూల దండలు తేవడం మానేసి పిల్లలకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు లాంటివి తేవాలని శ్రావణి శ్రీ తన కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఇదే పద్ధతి అన్ని చోట్లా అవలంబిస్తే బాగుంటుంది కదా!

Share