ఇప్పుడు ఢిల్లీ లో చంద్రబాబు నాయుడు హవా అంతా ఇంతా కాదు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ ఎంపీలు అత్యంత కీలకం కావడంతో మోడీ దగ్గర చంద్రబాబు ప్రాముఖ్యత ఎక్కువైయింది.తాజాగా దిల్లీలోని ఎన్‌డీఏ కూటమి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పక్కనే చంద్రబాబు నాయుడు ఆసనం ఏర్పాటయింది. చంద్రబాబు రాజకీయ వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సంక్షోభాల నుంచి పార్టీని, ప్రభుత్వాలను సేఫ్‌గా ఉంచిన చరిత్ర ఆయన సొంతం. ఒక ప్రాంతీయ పార్టీని నాలుగు దశాబ్దాల పాటు సక్సెస్ పుల్‌గా నడిపించడమే కాకుండా, అదే ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకునేలా ఓ రేంజికి తీసుకెళ్లడం చంద్రబాబు నాయకత్వానికి నిదర్శనం. అంతేకాకుండా ఇప్పుడు దేశ రాజధాని దిల్లీలో మీడియా కూడా ఆయన చుట్టే తిరుగుతోంది. థట్ ఈస్ చంద్రబాబు