సంగీతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికైనా ఆనందాన్ని ఊరట కలిగించగల ఏకైక సాధనం. మెలోడీ అయితే చెప్పనవసరం లేదు. అలాంటి మెలోడీ కి గత మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా లోకొనసాగుతున్న సంగీత దర్శకుడు కోడూరి మరకతమణి కీరవాణి ఓ అద్భుతమైన రాగానే తన ఇంటిపేరుగా కలిగిన ఈయన నిజంగా సంగీత ప్రపంచంలో వెలకట్టలేని మణి 1989 డిసెంబర్ 9 తన తొలి పాట రికార్డింగ్ తో తన సంగీత జైయాత్ర మొదలుపెట్టిన ఎం. ఎం. కీరవాణి జన్మదినం జూలై 4 1961 ఎమ్ ఎమ్ కీరవాణి తన కంటూ ఒక పేరు తెచ్చుకున్న భారతీయ చలనచిత్ర స్వరకర్త నేపథ్య గాయకుడు మరియు గీతరచయిత ప్రధానంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమిళం కన్నడం మలయాళం లో ఇతర భాషలతో పాటు పని చేస్తారు