కాంగ్రెస్ పార్టీకి డి.శ్రీనివాస్ (డీఎస్) ఎంతో సేవ చేశారని.. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో డీఎస్ భౌతికకాయం వద్ద ఆయన నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ‘‘డీఎస్ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు. 2004, 2009లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఎంతో కృషి చేశారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారని చెప్పారు. చనిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా కప్పాలనేది డీఎస్ కోరిక. అందుకే ఆ కోరిక తీర్చామని తెలిపారు.
Share