జన్వాడలో ఫామ్‌హౌస్‌పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడి రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో శనివారం అర్ధ రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించారు. ఫామ్‌హౌస్ యజమానిని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలగా గుర్తించారు. ఇక్కడ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విదేశీ మద్యం సహా భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద మరో కేసు నమోదు చేశారు. క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కాయిన్స్ సైతం ఇక్కడ లభ్యమయ్యాయి. దీంతో క్యాసినో నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 30 ఎకరాల్లో రాజ్ పాకాల ఫామ్‌హౌస్ విస్తరించి ఉంది.