భర్తతో కటీఫ్ చెప్పి.. ప్రియుడితో కాపురం చేస్తున్న ఓ యువతి వ్యవహారం ఆ కుటుంబాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసేసింది. రెండు ప్రాణాలను బలిగొనటమే కాకుండా.. భర్తని
కటకటాలపాలయ్యేలా చేసింది. చిన్నారుల పరిస్థితిని అగమ్యగోచరంగా మార్చేసింది.తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి ఆసుపత్రిలో స్కావేంజర్‌గా పనిచేస్తున్న వినయ్ అనే యువకుడికి అంజలితో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అంజలికి అంతకుముందే పెళ్లయి.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వ్యవహారం భర్తకు తెలియటంతో.. తన భర్తను, పిల్లల్ని వదిలేసి.. ప్రియుడి దగ్గరికే వెళ్లిపోయింది. విడాకులు తీసుకోకుండానే వినయ్‌తో రెండో పెళ్లి చేసుకుంది.పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వటంతో.. భర్త దగ్గరికి వచ్చింది. భార్య తన దగ్గరికి వచ్చేసిందని ఆ భర్త సంబరపడేలోపే.మరోసారి షాక్ ఇచ్చింది. మళ్లీ ప్రియుడి దగ్గరికి వెళ్లిపోవటంతో.. భార్యతో పాటు వినయ్ మీద కోపంతో రగిలిపోయి అతి కిరాతకంగా బంధువులతో కలిసి నరికి చంపాడు. ప్రేమించిన ప్రియుడు చనిపోయాడు.
Share