Current Date: 27 Nov, 2024

ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు భార్య క్లారిటీ వేణుస్వామికి కౌంటర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పని బాహుబలితోనే అయిపోయిందని.. ఆయన తన కెరీర్‌లో చూడాల్సిన పీక్స్ చూసేశారని ఇక ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు ఆలోచించాల్సిందేనని గతంలో వేణుస్వామి ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. కట్ చేస్త్ మొన్న సలార్, ఇప్పుడు కల్కితో ప్రభాస్ వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టారు. దీంతో వేణుస్వామిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణం రాజు భార్య శ్యామలా దేవి కూడా వేణుస్వామికి ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు"మనిషిలో మంచితనం ఉంటే అది మనల్ని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో మరోసారి రుజువైంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌కి హిట్‌యే రాదంటూ కొందరూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు. కానీ వారి అంచనాలన్నీ తారుమారయ్యాయి. కల్కితో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు." అంటూ శ్యామలా దేవి అన్నారు.అలానే ప్రభాస్‌కి జీవితంలో పెళ్లి జరగదంటూ వేణుస్వామి గతంలో చేసిన కామెంట్లకి కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు.

Share