ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. ఎన్నికల హామీ మేరకు ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ, మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విడతలో సుమారు 3,600 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రభుత్వ, మున్సిపల్ స్కూళ్లలో 1,700 పోస్టులు, గురుకులాలు వంటి రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,200 మరియు ప్రత్యేక విద్యా పోస్టులు 700 వరకు ఉండే అవకాశం ఉంది. ప్రిపరేషన్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈసారి డీఎస్సీ సిలబస్లో ఎటువంటి మార్పులు చేయకూడదని నిర్ణయించింది. గత నోటిఫికేషన్ నిబంధనలనే వర్తింపజేయడం వల్ల నిరుద్యోగులకు ప్రిపరేషన్ మరింత సులభం కానుంది. కేవలం కొత్త నియామకాలే కాకుండా, ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల పట్ల కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని టెట్ అర్హత సాధించిన వారికి ఈ డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలని భావిస్తోంది. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేసేలా కసరత్తు చేస్తోంది