న్యూజిలాండ్‌తో ఆదివారం ముగిసిన తొలి టెస్టులో భారత్ జట్టు ఓటమి పాలైనప్పటికి మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తన అద్బుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. స్లిమ్‌గా లేడని ఇప్పటివరకు సర్ఫరాజ్‌కు అవకాశమివ్వని భారత సెలక్టర్ల తీరును తాజాగా గవాస్కర్ తప్పుబట్టాడు.వాస్తవానికి దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీలు చేశాడు. కానీ భారత జట్టులో చోటు సంపాదించుకోవడానికి 5-6 ఏళ్ల సమయం పట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌కు తగ్గట్టు అతడు స్లిమ్‌గా లేడని, నడుము సన్నగా లేదని సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. భారత్ జట్టులోకి రావాలంటే యో-యో ఫిటెనెస్ టెస్టులో పాస్ అవ్వాల్సి ఉంటుంది. దాన్ని బూచిగా చూపిస్తూ సర్ఫరాజ్ ఖాన్‌ని ఇన్నాళ్లు పక్కనపెట్టారు.కానీ బెంగళూరు టెస్టుకి మెడ నొప్పి కారణంగా సడన్‌గా శుభమన్ గిల్ దూరం అయ్యాడు. దాంతో సర్ఫరాజ్ ఖాన్‌కి అవకాశం దక్కగా 150 పరుగులతో చెలరేగిపోయాడు.