Current Date: 25 Nov, 2024

కరోనా తరహా మరో సంక్షోభం తప్పదన్న బ్రిటన్ ప్రభుత్వ మాజీ సలహాదారు...

కరోనా తరహా మరో సంక్షోభాన్ని మానవాళి మళ్లీ ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపు నిచ్చారు. సంక్షోభ నివారణ ఏర్పాట్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ దిశగా కీలక అంశాలపై తక్షణం దృష్టి పెట్టాలన్నారు. రాబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు పటిష్ఠ నిఘా వ్యవస్థ ఉండాలన్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు తక్షణం స్పందించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. తగిన స్థాయిలో వైద్య పరీక్షల నిర్వహణ సామర్థ్యం, టీకాలు, చికిత్సలు అన్నీ అందుబాటులో ఉంటే లాక్ డౌన్, భౌతిక దూరం వంటి కఠిన చర్యల అవసరం ఉండదని అన్నారు.