Current Date: 05 Oct, 2024

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను  సీఈసీ రాజీవ్ కుమార్ రిలీజ్ చేశారు. జమ్మూకశ్మీర్లోని 90 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలుంటాయని ప్రకటించారు. సెప్టెంబర్ 18న తొలి విడత (24 అసెంబ్లీ స్థానాలకు), 25న రెండో విడత (26 అసెంబ్లీ స్థానాలకు), అక్టోబర్ 1న మూడవ విడత (40 అసెంబ్లీ స్థానాలకు) పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఫలితాలను అక్టోబర్ 4న వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు.

Share