Current Date: 04 Jul, 2024

చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపు.. కారణమిదే!

ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. దాంతో.. కొన్ని గంటల ముందే పార్టీలతో పాటు.. ఏపీ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసంఉత్కంఠగాఎదురుచూస్తున్నారు.అయితేఎన్నికలఫలితాలనేపథ్యంలోపోలీసులుఅలెర్ట్అయ్యారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇళ్ల వద్ద భద్రతను పెంచారు. తాడేపల్లి, మంగళగిరిలోని వైసీపీ, టీడీపీ పార్టీ ఆఫీసుల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి నేపథ్యంలో ఏపీ డీజీపీ అదేశాలతోభద్రతపెంచినట్లుతెలుస్తోందిఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద భద్రతా సిబ్బందిని పెంచారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో ఉన్నచంద్రబాబుఇంటివద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. రిజల్ట్స్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తచర్యల్లోభాగంగానేభద్రతనుపెంచారు.ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి. టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లలో పోటీ చేయగా.. జనసేన 21ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో బరిలో నిలిచింది. అటు బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 లోక్ సభ స్థానాలలో బరిలోకి దిగింది. అధికార వైసీపీ మాత్రం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది.