ఆంధ్రప్రదేశ్‍లో వరద బాధితులకు మంచు మోహన్ బాబు కుటుంబం రూ.25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు విరాళం తాలూకూ చెక్కును అందించారు.ఇటీవల తిరుమల లడ్డూ వివాదం సమయంలో మోహన్ బాబు.. చంద్రబాబుకు అనుకూలంగా ట్వీట్ చేశారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని తెలియగానే తల్లడిల్లిపోయానంటూ ట్వీట్ చేశారు. ఈ ఘోరానికి కారణమైన నేరస్థులను శిక్షించాలని ఆత్మీయుడు, మిత్రుడు అయిన చంద్రబాబు నాయుడును కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. సుదీర్ఘకాలంగా చంద్రబాబు, మోహన్ బాబు ఫ్రెండ్స్ అయిన విషయం తెలిసిందే. అయితే.. చాలా రోజుల తర్వాత ఇద్దరూ మళ్లీ కలిశారు.వరద బాధితుల సాయం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటి వరకూ రూ.425 కోట్ల రూపాయలు విరాళంగా అందినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.తన చరిత్రలో చాలా సంక్షోభాలు చూశానన్న చంద్రబాబు.. కానీ ఈసారి ప్రజలు స్ఫూర్తి, నమ్మకంతో ముందుకొచ్చారంటూ కొనియాడారు.