Current Date: 05 Oct, 2024

నాగచైతన్య లైఫ్‌లోకి మరో సమంత ఎంట్రీ!

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య జీవితంలోకి మరో సమంత ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో  నిన్న నాగచైతన్య నిశ్చితార్థం చేసుకోగా త్వరలోనే వీరి వివాహం జరగనుంది. దాంతో అసలు శోభితా ఎవరు? వారి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ ఏంటి? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. శోభితా స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. నిశ్చితార్థం తర్వాత శోభితా మేనమామ, న్యాయవాది జంధ్యాల శివగణేష్‌ మీడియాతో వివరాల్ని వెల్లడించారు. తెనాలికి చెందిన ఉపాధ్యాయుడు జేవీఎల్‌ శాస్త్రి, కమలమ్మ దంపతుల కుమార్తె శాంతాకామాక్షి. ఆమె బీఎస్సీ, బీఈడీ చేసి తెనాలి మున్సిపల్‌ పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వర్తించారు. ఆమెకు విశాఖకు చెందిన మెరైన్‌ ఇంజినీర్‌ వేణుగోపాల్‌తో వివాహం అయింది. ఈ దంపతుల కూతురే శోభితా ధూళిపాళ్ల ఇక్కడే మరో ఇంట్రస్టింగ్ విషయం బయటికి వచ్చింది. శోభితాకి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు సమంత. హీరోయిన్ సమంతని 2017లో పెళ్లి చేసుకున్న నాగచైతన్య నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కానీ సమంత పేరుతో మళ్లీ శోభితా చెల్లి మళ్లీ చైతన్య ఫ్యామిలీలోకి రాబోతోందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Share