Current Date: 06 Jul, 2024

టీడీపీలో చేరిన పాయకరావుపేట వైసీపీ కీలక నాయకుడు గూటూరు శ్రీను

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియో జకవర్గంలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గ కేంద్రం పాయకరా వుపేట మండలంలో వైసీపీ కీలక నాయకు డు , యలమంచిలి మార్కెట్ కమిటీ ఉపా ధ్యక్షులు గూటూరు శ్రీనుతో పాటు, అతని ఆధ్వర్యంలో పలువురు ఎంపీటీసీ సభ్యు లు, సర్పంచ్ అభ్యర్థులు, నాయకులు సుమారు 200 మంది కార్యకర్తలు బుధ వారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గూటూరు శ్రీను, మండల ఉపాద్యక్షులు ( వైస్ ఎంపీ పీ ) స్వామి, ఈదటం ఎంపిటిసి పద్మ , పాల్మాన్ పేట ఎంపీటీసీ మాంకాలమ్మ , మాజీ ఎంపీటీసీ రమణ, మాజీ సర్పంచ్ ధోని దుర్గారావు, మత్యకార నాయకుడు అశోక చక్రవర్తి,  మాజీ ఎంపీటీసీ నడింపల్లి గొల్లబాబు, మహిళా సంఘం నాయకురా లు కందాల లక్ష్మి, వార్డ్ సభ్యులు, నాగా ర్జున, మహేష్, నూకరత్నం, పాయకరావు పేట పంచాయతీ వార్డు సభ్యులు భీమిరె డ్డి బాబ్జి, పల్లా ప్రసాద్, తాటిపాక నూకర త్నంతోపాటు సుమారు 200 మంది కార్య కర్తలు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే ఎస్. రాయవరం మండ లం  కొరుప్రోలు గ్రామానికి చెందిన సుధా కర్ ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబా లు వైసీపీ ని విడిచి అయ్యన్న సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ
.. ఈ సైకో జగన్మో హన్ రెడ్డిని గద్దె దించేం దుకు గాను మనందరం కలిసి పనిచేయా లని సూచించారు. తెదేపా , జనసేన , బిజె పి పార్టీల ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత గెలుపు కోసం కార్యకర్తలు అంద రూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
ఆంద్రప్రదేశ్ బాగుండాలంటే సైకో పోవాలి సైకిల్ రావాలని అన్నారు. పాయకరావు పేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంగల పూడి అనిత మాట్లాడుతూ.. పాయకరా వుపేట నియోజకవర్గ ప్రజలు నాపై చూపి స్తున్న ఆదరాభిమానాలకు ప్రత్యేక ధన్య వాదాలు తెలియజేస్తున్నానన్నారు. వైసిపి నుండి గుటూరు శ్రీను తమ కార్యకర్తలతో సహా  తెలుగుదేశం పార్టీలో చేరడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.