తెలంగాణలో రాజకీయాలు కేసులు, పరువు నష్టం దావాలతో వేడెక్కాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేటీఆర్ మీద కేసు నమోదు చేశారు.అయితే. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ చేపడుతోన్న మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో లక్షన్నర కోట్ల కుంభకోణం ఉందని.. అందులో రూ.25 వేల కోట్లు ఢిల్లీకి పంపుతున్నారంటూ.. కేటీఆర్ పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆమె ఫిర్యాదు మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కోసం లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టనున్నట్టు గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఇదే విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే ప్రస్తావిస్తూ.. ఇందులో భారీ స్కాం ఉందంటూ ఆరోపిస్తూ వస్తున్నారు.