Current Date: 04 Jul, 2024

Megastar Chiranji beat his younger brother Nagababu

మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు నాగబాబుని ఓసారి కొట్టారట. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ‘‘అమ్మకు చిన్ననాటి నుంచి అన్ని విషయాల్లో సాయంగా ఉండేవాడిని. ఒకరోజు ఒకేసారి రెండు పనులు చేయాల్సి వచ్చింది. అయితే నాగబాబుకు లాండ్రీ నుంచి బట్టలు తీసుకువచ్చే పని పురమాయించాను. కానీ.. నేను ఒక పని పూర్తి చేసుకుని వచ్చేసరికి నాగబాబు ఇంట్లోనే ఉన్నాడు. అది చూసి కోపంతో లాండ్రీ నుంచి బట్టలు తీసుకురాలేదా? అని అడిగితే, లేదు నిద్రపోతున్నా అన్నాడు. కోపం ఆపుకోలేక కొట్టేశాను.

అది చూసి అమ్మ నన్ను తిట్టేసింది కూడా. సాయంత్రం వరకూ ఎదురుచూసి నాన్న రాగానే విషయం మొత్తం ఆయనకు చెప్పేశా. అప్పుడు నాన్న కూడా వెళ్లి నాగబాబును మందలించేసరికి నాకు రిలీఫ్ అనిపించింది” అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

జనసేన నుంచి అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తాడని తొలుత ప్రచారం జరిగింది. ఓ వారం రోజుల పాటు అక్కడ ఆయన ప్రచారం కూడా చేశారు. కానీ.. పొత్తులో భాగంగా ఆ ఎంపీ టికెట్‌ను బీజేపీ దక్కించుకుంది. దాంతో రానున్న ఎన్నికల్లో నాగబాటు పోటీకి దూరంగా ఉండిపోయారు.