Current Date: 05 Oct, 2024

ఢిల్లీలో నేడు జగన్ ధర్నా రెండో ప్లాన్ కష్టమే

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు వైసీపీ ధర్నా చేయబోతోంది. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే ప్రధాన డిమాండ్‌తో  వైయస్ జగన్ ధర్నాకు దిగుతున్నారు. ఆయనతోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇతర కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  ధర్నాతోపాటు, 50రోజులుగా ఏపీలో జరుగుతున్న వివిధ పరిణామాలపై ఫొటో ఎగ్జిబిషన్ కూడా వైసీపీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కూటమి ఏర్పడ్డాక ఏపీలో జరిగిన హత్యలు, అఘాయిత్యాలను హైలైట్ చేసే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా తమతో కలసి వచ్చే పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటాయని వైసీపీ అంచనా వేస్తోంది. అయితే ఈ ధర్నాకు సొంత పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ వస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా వారి విషయంలో కూడా ఈరోజు క్లారిటీ వస్తుంది. ఏపీ పరిస్థితిని స్వయంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కి వివరించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అపాయింట్ మెంట్ లు కూడా అడిగారు నేతలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్న కేంద్ర మంత్రులు వైసీపీకి సమయం కేటాయించే సూచనలు కనిపించడం లేదు.

Share