ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రజాదరణ పొందడానికి ప్రయత్నించడం తప్ప వైసీపీ అధినేత వైయస్ జగన్‌కి మరో ప్రత్యామ్నాయం లేదు. గత అసెంబ్లీలో 23 సీట్లతో అడుగు పెట్టిన చంద్రబాబు, ఆయన పార్టీ అభ్యర్థుల్ని సీఎం హోదాలో వైఎస్ జగన్, ఆయన పార్టీ అభ్యర్థులు ఘోరంగా అవహేళన చేశారు.అప్పట్లో ఓ అడుగు ముందుకేసి మరీ.. తాను తలచుకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా టీడీపీ అభ్యర్థుల్ని చేర్చుకోగలనని అసెంబ్లీ వేదికగా జగన్ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు వైసీపీ 11 సీట్లే గెలిచింది. దాంతో గతంలో తాను మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి అతి తక్కువ మంది సభ్యులతో చట్టసభ సమావేశాలకు వెళ్లడానికి జగన్‌కు ధైర్యం సరిపోవడం లేదు. దాంతో ఎలాగైనా అసెంబ్లీసమావేశాలకుగైర్హాజరయ్యేందుకు సాకుకోసంవెతుకుతున్నాడు.అసెంబ్లీలో తనను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకుండా, మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారంటూ వైఎస్ జగన్ తాజాగా నిష్టూరమాడుతూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదని చెప్పుకోడానికి ఈ లేఖ పనికొస్తుందని జగన్ ప్లాన్‌గా తెలుస్తోంది.