తిరుమలలో ఎవరూ ఊహించని ఓ ఘటన చోటు చేసుకుంది. భక్తుల కోర్కెలు తీర్చే వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలో పట్ట పగలే దొంగతనం జరిగింది. నవంబర్ 23న శ్రీవారి ఆలయంలోని స్టీల్ హుండీలోని కొంత నగదును ఓ వ్యక్తి దొంగిలించాడు. పట్టపగలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కొంత నగదును చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఫుటేజీలను పరిశీలించి దొంగతనానికి పాల్పడిన యువకుడిని గుర్తించారు. భద్రతా సిబ్బంది తమ ఆఫీస్ లో అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. ఆ దొంగ నుంచి రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా సిబ్బంది తెలిపారు. చోరీ కి పాల్పడిన యువకుడి పేరు వేణు లింగం అని , తమిళనాడులోని శంకరన్ కోవిల్ కు చెందినవాడని వివరించారు. అనంతరం టీటీడీ అధికారులు అతడిని పోలీసులకు అప్పగించారు.
Share